హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మంత్రి తుమ్మల పర్యటన వివరాలు

KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం నగరంలోని 29వ డివిజన్ ప్రకాష్ నగర్‌లో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, స్థానిక కాటన్ మార్కెట్ నుంచి శ్రీనివాస్ నగర్ మీదుగా దంసలాపురం రోడ్ వరకు బీటీ రోడ్డు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.