హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగపల్లెలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

NDL: సంజామల మండలం మంగపల్లెలో ఆదివారం 71వ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి సుమారు 1,500 మంది హాజరైనట్లు నిర్వాహకుడు పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి తెలిపారు. గుండె, షుగర్, బీపీ, కంటి, దంత, చర్మ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందించారు. అనంతరం రోగులకు భోజన సదుపాయం కల్పించారు.