హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదుగుళ్ల పోచమ్మ బోనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD: రామచంద్రాపురం డివిజన్‌లో ఆదివారం రాత్రి ఐదుగుళ్ల పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.