హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డుపై తెగి పడిన 11 కేవీ విద్యుత్ తీగ.. తప్పిన ప్రమాదం

MNCL: మందమర్రి మండలం ఆదిల్ పేట్‌లో ఆదివారం రాత్రి 11 కేవీ విద్యుత్ తీగ తెగి రోడ్డుకు సమీపంలో పడింది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనతో గ్రామంలో రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు.