హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీయూలో నేటి నుండి క్రీడా పోటీలు

MBNR: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలమూరు విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు రిజిస్టర్ ప్రొ. పి. రమేష్ బాబు తెలిపారు. నేటి నుండి సెప్టెంబర్ 3 వరకు క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, షాట్‌పుట్, రన్నింగ్, స్కిప్పింగ్ వంటి పలు అంశాలలో పోటీలు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.