హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండుతున్న వరి

NRPT: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక మరికల్ మండలం అప్పంపల్లికి చెందిన రైతు శివాజీ 4 ఎకరాల్లో సాగుచేసిన వరి పంట ఎండిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో పొలంలో నెర్రెలు ఏర్పడ్డాయి. పంటను కాపాడుకునేందుకు 500 అడుగుల లోతు వరకు బోరు వేసినా నీరు పడలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.