హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు శ్రీరంగనాథ స్వామి తిరుకళ్యాణ మహోత్సవం

WNP: శ్రీరంగపురం మండల కేంద్రంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో రేవతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇవాళ స్వామి, అమ్మవార్ల తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయ అర్చకులు విష్ణునారాయణ తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజలతో తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.