హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒంటిగుట్ట తండాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

WNP: వీపనగండ్ల మండలం వల్లభాపురం తండా పరిధిలోని ఒంటిగుట్ట తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ఆదివారం నిర్వహించారు. లబ్ధిదారులు ఎస్. శిరీష భర్త నరసింహ, కే. జ్యోతి భర్త గోవిందుల ఇళ్లను సర్పంచ్ సభావత్ శివమ్మ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు, సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.