NZB: వర్ని మండలం చింతల్ పేట్‌కి చెందిన బర్దావల్ సురేష్ చౌదరి ఆర్చరీ పోటీల్లో ఉమ్మడి NZB జిల్లా నుంచి గోల్డ్ మెడల్ సాధించాడు. బోర్గాం ZPHS పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సురేష్ చౌదరి, దోమకొండలో జరిగిన ఉమ్మడి జిల్లా డిస్ట్రిక్ట్ మీట్‌లో ఈ ప్రతిభ కనబరిచాడు. ఈ విజయంతో అతను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. వచ్చే నెల సెప్టెంబర్ 6న రాష్ట్రస్థాయి మీట్ జరగనుంది.
తెలంగాణ
ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించిన సురేష్


