హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కుంటలో పడి అన్నదమ్ముల మృతి

WGL: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గణేష్‌లాల్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండికుంటలో పడి అన్నదమ్ములు మాలోతు వినయ్‌ (15), రాజేష్‌ (12) మృతిచెందారు. రాఖీ పౌర్ణమికి అమ్మమ్మ ఇంటికి వచ్చిన వీరిద్దరూ ఆదివారం పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అనంతరం బహిర్భూమికి కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. పోలీసులు విచారణ చేపట్టారు.