హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళల కోసం ఉచిత క్యాన్సర్‌ శిబిరం'

MBNR: ​మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో మహిళల కోసం సెప్టెంబర్‌ 2, 3 తేదీల్లో బాలానగర్ ఎంపీపీ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించనున్నట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బసవతారకం వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.