హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు

GDWL: గద్వాలలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కారు నడుపుతూ మద్యం మత్తులో యువకుడు బ్రిడ్జి పై డివైడర్‌ను ఢీకొనడం జరిగింది. అనంతరం మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తి కారును వదిలి పరారైనట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రడు తోపాటు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేశారు.