హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంజారా ఏక్తా సంకల్పయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి

MHBD: కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా పట్టణంలో బంజారా ఏక్తా సంకల్పయాత్ర సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి బంజారా ఏక్తా జాతీయ మహిళా విభాగం సంఘ సమన్వయకర్త, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బంజారా సమాజ ఐక్యత, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై నాయకులు చర్చించారు.