హైదరాబాద్: 28°C
తెలంగాణ

హిందూ ఉత్సవ సమితి సమావేశం

​VKB: తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మంగళవారం ఉదయం 11 గంటలకు హిందూ ఉత్సవ సమితి ముఖ్య సమావేశం జరగనుంది. ఈ భేటీలో నూతన కమిటీ ఎన్నికతో పాటు రాబోయే ఉత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. నియోజకవర్గ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సమితి ప్రధాన కార్యదర్శి పెట్లోళ్ల నర్సింలు కోరారు.