హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరుగుదొడ్లు లేక.. ఇక్కట్లు వీడక!

ADB: నార్నూర్ మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగడి బజార్‌లోని టాయిలెట్ భవనం ఏళ్లుగా అసంపూర్తిగా ఉండగా, స్థానిక కూరగాయల మార్కెట్‌లోని టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి టాయిలెట్లను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.