హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'విగ్రహం చుట్టూ చెత్తకుప్పలు'

WNP: వనపర్తి కమాన్‌ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే డా. బాలకిష్టయ్య విగ్రహం చుట్టూ కొందరు వ్యర్థాలు పారబోస్తున్నారు. రాత్రివేళ కూరగాయల వ్యాపారులు మిగిలిన కూరగాయల వ్యర్థాలు, చెత్తను అక్కడ వేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పుర సిబ్బంది రోజూ చెత్త తొలగిస్తున్నా, వ్యర్థాలు వేయకుండా అవగాహన కల్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.