హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్బీనగర్‌లో ‘ఇందిరమ్మ’ ఇళ్ల లక్కీడ్రా

HYD: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలోని బండ్లగూడ రాజీవ్‌ స్వగృహ కమ్యూనిటీ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు అధికారులు ఆదివారం లక్కీడ్రా నిర్వహించారు. పూర్తి పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా అర్హులకు ప్లాట్లు కేటాయిస్తున్నారు. తమ సొంతింటి కల నెరవేరుతుందో లేదోనని దరఖాస్తుదారులు తీవ్ర ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.