హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

WGL: గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ పరిధిలోని కుమ్మరిగూడెం, తరాలపల్లి గ్రామాల్లో రూ.1.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.