BDK: భద్రాద్రి కలెక్టరేట్‌లో సోమవారం 10.30 గంటలకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకే హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాలతో పాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
ప్రజావాణికి అధికారులు హాజరు కావాలి: కలెక్టర్


