హైదరాబాద్: 28°C
తెలంగాణ

విభిన్న సంస్కృతులకు నిలయం పటాన్‌చెరు

SRD: పటాన్‌చెరు నియోజకవర్గం విభిన్న సంస్కృతులు, ఆచారాలకు నిలయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి పండుగలు ప్రతీకగా నిలుస్తాయని, ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.