హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మేయర్

KNR: కరీంనగర్ పట్టణంలోని తీగలగుట్టపల్లి రైల్వేగేటు వద్ద రూ.33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న తారు రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ప్రయాణికుల రాకపోకల ఇబ్బందులను తొలగించేందుకు ప్రాధాన్యతగా ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో ఆర్వోబీ పనులు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు.