హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏవో శ్రీనివాసరావుకు ఘన సత్కారం..!

ఖమ్మం కలెక్టరేట్ పరిపాలనాధికారి (AO) కారుమంచి శ్రీనివాసరావు పదవీ విరమణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కందాల ఉపేందర్ రెడ్డి.. శ్రీనివాసరావును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రభుత్వానికి అందించిన సేవలను కొనియాడి, రిటైర్మెంట్ తర్వాత శేష జీవితం ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.