హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జార్జియా నుంచి వచ్చి రాఖీ కట్టింది

SRD: రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు జార్జియా దేశం నుంచి ఓ యువతి జిన్నారానికి వచ్చింది. విదేశాల్లో ఉన్నప్పటికీ మన సంస్కృతిని మరువకుండా, పండుగ నాడు కుటుంబ సభ్యులతో గడపాలనే ఉద్దేశంతో ఆమె ఇక్కడికి చేరుకుంది. తన అన్నదమ్ములకు స్వయంగా రాఖీ కట్టి, వారి ఆశీర్వాదాలు తీసుకుంది. ఈ వేడుక కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపింది.