హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లలిత కళా సమితి స్థలం పరిరక్షించాలి'

JGL: మెట్పల్లి పట్టణంలోని లలిత కళా సమితి స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్వర్ణకార సంఘం నాయకులు ఆరోపించారు. ఐదు దశాబ్దాలుగా సమితి ఎందరో కళాకారులను తీర్చిదిద్దిందని తెలిపారు. సమితికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, అధికారులు వెంటనే స్పందించి స్థలాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణమాచారి, మహేష్, విద్యాసాగర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.