హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రధాన రహదారిపై అడ్డంగా పశువుల సంచారం

ASF: ఆసిఫాబాద్ బస్టాండ్ ప్రాంత ప్రధాన రహదారిపై పశువులు అడ్డంగా సంచరిస్తూ, రోడ్డుపైనే నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాహనాలు రాకపోకలు సాగించే మార్గంలో పశువుల సంచారంతో ప్రమాదాలకు అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పశువుల యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.