హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దారికి తాత్కాలిక మరమ్మతులు

MNCL: బెల్లంపల్లి పట్టణంలో పోచమ్మ చెరువు దారిపై ఆదివారం మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో దారి గుంతలుగా ఏర్పడి వర్షం నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో వాహన చోదకులు ప్రయాణించడానికి ఇబ్బందులు పడ్డారు. ఈ దారి గుండా చంద్రవెల్లి, భూదాకలాన్, శిరిడి సాయిబాబా దేవాలయం, ఇతర గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.