హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దారుణం.. బాలికపై అఘాయిత్యం

కృష్ణా జిల్లా అవనిగడ్డలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి బాలికను మాయమాటలతో లొంగదీసుకుని 57ఏళ్ల RMP వైద్యుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక గర్భం దాల్చి 9 నెలల గర్భంతో పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలిక ప్రసవించినట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.