హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్ష

PDPL: సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ కళాశాలలో ఆదివారం నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు 100 మంది అభ్యర్థులకు గాను 98 మంది హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ తెలిపారు. పరీక్ష నిర్వహణ తీరును తహసీల్దార్ సుమన్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పరిశీలించారు.