హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెహెర్ బాబా బోధనలు ఆచరణీయం: ఎమ్మెల్యే

కృష్ణా: మనిషి మృగత్వాన్ని వీడి మానవత్వాన్ని పెంపొందించుకోవాలని మెహెర్ బాబా బోధించారని అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చల్లపల్లిలోని నడకుదురు రోడ్డులో మెహెర్ రైస్ మిల్లు ప్రాంగణంలోని నూతన గోడౌన్‌లో ఆదివారం మెహెర్ బాబా 61వ వార్షికోత్సవ సహవాస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు పాల్గొని మెహెర్ బాబాను స్మరించుకున్నారు.