హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోపిరెడ్డి విమర్శలను ఖండించిన షేక్ మస్తాన్

PLD: నరసరావుపేటలో స్కూల్ బ్యాగులను చూపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన విమర్శలను ఐటీడీపీ నేత షేక్ మస్తాన్ వలి ఖండించారు. ఒక్కటి రెండు బ్యాగులను చూపించి ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. బ్యాగుల నాణ్యతపై సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందని హితవు పలికారు.