హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుభాష్ కాలనీలో చోరీ

BHPL: జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో చోరీ జరిగింది. శ్రవణ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు 4 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.4 వేల నగదు అపహరించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.