హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణిలో యువతీ యువకులకు ఉచిత శిక్షణ

PDPL: రామగుండం సింగరేణి ఆర్జీ-1 సేవా సమితి ఆధ్వర్యంలో యువతీ యువకులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పిల్లలతో పాటు ప్రభావిత ప్రాంతాల యువతకు అవకాశం కల్పిస్తున్నమన్నారు. అర్హత ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 10లోగా ఆర్జీ-1 జీఎం ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు.