JGL: కథలాపూర్ మండలం తక్కెళ్లపల్లిలో ఇవాళ ఆరోగ్య సిబ్బంది డెంగ్యూ నివారణపై అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే నిర్వహించాలని కోరారు. జ్వరం, ఇతర లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో CHO టి.వేణుగోపాల్, ఏఎన్‌ఎం రజిత పాల్గొన్నారు.
తెలంగాణ
డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన


