హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీళ్లు నింపే బాధ్యత మాది: మంత్రి

HNK: గౌరవెల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నీళ్లు నింపే బాధ్యత తనదేనని మంత్రి పొన్నం అన్నారు. భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి, 'పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో పాల్గొన్నారు. గొల్లపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.