హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు

VZM: కంటకాపల్లి అలమండ రైల్వేస్టేషన్ పట్టాల మధ్య సుమారు 60-65 వయస్సు గల మృతదేహం గుర్తించినట్లు జీఆర్పీ హెచ్‌సీ ఎంఎస్ ప్రసాద్ ఆదివారం తెలిపారు. మృతదేహం 5 అడుగుల 6 అంగుళాలు పొడవు ఉండి, చామనచాయ రంగులో ఉంటాడన్నారు. ఎరుపు రంగు కట్ బనియన్, తెలుపు నీలం నలుపు టీ షర్ట్ ధరించినట్లు చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ ఫోన్ నెంబర్ 9247585742 ను సంప్రదించాలని కోరారు.