హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

ASF: రెబ్బెన మండలం NTR కాలనీలో CI సంజయ్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇంటింటా తనిఖీలు చేపట్టి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అక్రమ మద్యం విక్రయాలకు సంబంధించి ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. 40 వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. SI వెంకటకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.