NLG: మునుగోడులో సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద BRS ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలన, 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నిస్తూ ధర్నా, హామీల భరోసా కార్డు, ఫ్లెక్సీల ప్రదర్శన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
తెలంగాణ
మునుగోడులో బీఆర్ఎస్ నిరసన


