హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ పండుగ రక్షణకు ప్రతీక: ఆర్.లక్ష్మి

ADB: రాఖీ పండుగ రక్షణకు ప్రతీక అని, సమాజంలో సామరస్యం వస్తే మహిళలపై అఘాయిత్యాలు తగ్గుతాయని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇంచార్జీ ఆర్.లక్ష్మి తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో AAP ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ వేడుకల్లో విలేకరులకు రాఖీలు కట్టి సోదరభావం చాటుకున్నారు. సమస్యలపై పోరాడే జర్నలిస్టులతో పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.