హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ అభివృద్ధికి భక్తుల విరాళాలు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు భక్తులు విరాళాలు అందజేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన గుండ శ్రీనివాస్ రూ.25,116, కొండగట్టుకు చెందిన నడిగొట్టు శకుంతల- లక్ష్మణ్ దంపతులు రూ.10,116 చొప్పున విరాళాలు సమర్పించారు. ఆలయ PRO పెరిక శ్రీనివాస్‌కు నగదు అందజేయగా, సిబ్బంది పాల్గొన్నారు. దాతలకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.