WGL: గురుకులం విద్యార్థినిని పాము కాటు వేసిన ఘటన రాయపర్తి మండలంలో జరిగింది. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిని పాము కాటు వేసింది. దీంతో పాఠశాల సిబ్బంది బాలికను చికిత్స నిమిత్తం వర్ధన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం MGMకు తరలించారు.
తెలంగాణ
గురుకులం విద్యార్థినిని కాటు వేసిన పాము


