హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో రూ.2 వేల కోట్లతో ఏఐజీ ఆసుపత్రి

విశాఖలోని ఎండాడలో అంతర్జాతీయ స్థాయి ఏఐజీ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 9 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 1,000 పడకలు, 50కి పైగా ప్రత్యేక వైద్య విభాగాలతో ప్రపంచస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.