కృష్ణా: స్థానిక ఎన్నికల నేపథ్యంలో గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లు, అనుమానితులకు ఎస్సై చంటిబాబు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణానికి సహకరించాలని సూచించారు. రూరల్ మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుడివాడలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్


