కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం హిస్టరీ షీట్ హోల్డర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
షీటర్లు బాధ్యతాయుతంగా మెలగాలి: ఎస్సై


