KNR: డబుల్ రోడ్డు నిర్మాణం కోసం 24 గంటల దీక్ష పిలుపునివ్వడంతో గన్నేరువరంలో ఆదివారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీక్షకు తరలివచ్చిన యువజన సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, 15 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: డబుల్ రోడ్డు కోసం దీక్ష.. ఉద్రిక్తత


