NRML: తానూర్ మండలం మొగిలి గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో హుండీ పగులగొట్టి రూ.5 వేల నగదు చోరీ చేసిన కేసులో సిద్దులోళ్ల లక్ష్మణ్ (40)ను తానూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 27న తెల్లవారుజామున చోరీకి పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు. చోరీ చేసిన నగదును మద్యం కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఎస్సై తెలిపారు.
తెలంగాణ
ఆలయంలో హుండీ చోరీ.. నిందితుడి అరెస్ట్


