హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టణ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

SRCL: సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజును నియమించారు. సిరిసిల్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆదివారం ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు సిద్ధి దేవరాజును అభినందించారు.