NTR: జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పెనుగంచిప్రోలు గ్రామంలో రూ.1.91 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో DMF నిధులతో మైత్రి రోడ్డు నుంచి బీటీ రోడ్డు, కల్వర్టులు, రెండు వంతెనల నిర్మాణం జరగనుంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హామీల అమలుకు ఎమ్మెల్యే శ్రీకారం


