హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహాసభలను జయప్రదం చేయాలి'

ASF: సెప్టెంబర్ 8,9 తేదీల్లో మంచిర్యాలలో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కన్వీనర్ రత్నం పోషన్న పిలుపునిచ్చారు. ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో AIKMS ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. పోషన్న మాట్లాడుతూ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభ స్థితికి పాలకవర్గాలు అనుసరిస్తున్న రైతంగ వ్యతిరేక విధానాలు కారణమన్నారు.