BPT: తిరుపతిలో జరిగిన అమరావతి ఛాంపియన్‌షిప్ వెయిట్ లిఫ్టింగ్ అండర్-17 విభాగంలో చీరాలకు చెందిన గొర్ల పూర్ణ స్వామి యాదవ్ స్వర్ణ పతకం సాధించాడు. విజేతను తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరరావు అభినందించగా, చీరాలలో ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి పతకం సాధించడం చీరాలకు గర్వకారణమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెయిట్ లిఫ్టింగ్‌లో చీరాలకు స్వర్ణం


