SKLM: జాడుపూడి–ఇచ్చాపురం మధ్య రైల్వే పట్టాలపై సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఎరుపు-నలుపు టీషర్ట్, నీలం నైకీ ట్రాక్ ప్యాంట్ ధరించాడు. కుడి చేతిపై “JAYA DEB” అనే పచ్చబొట్టు ఉంది. తల వెనుక తీవ్ర గాయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ ఎస్సై దుంపల శ్రీనివాసరావు (92475 85743)ను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం


